రొండు రోజుల క్రితం నేను ఆర్టికల్ రాసాను డామియన్ ఎలా ఎంచుకోవాలి అని అలా రాసిన వెబ్ సైట్ కి పేరుని ఎలా ఎంచుకోవాలి అని ఆర్టికల్ చదివి నా ఫేస్బుక్ మిత్రుడు ఒకరు కాల్ చేసి వెబ్ సైట్ పేరు (డొమైన్ నేమ్ ) మీద తనకున్నపిచ్చి పిచ్చి డౌట్స్ బాగానే అడిగాడు. ఆ సమయం లో మా మధ్య ఒక చిన్న సంగర్షణ జరిగింది, వెబ్ సైట్ డొమైన్ సేల్స్, ఆన్లైన్ లో ఎలా సేల్ కి పెట్టాలి అనే దాని గురుంచి టాపిక్ వచ్చింది. వెబ్ సైట్ డొమైన్స్ వేలకి , లక్షలకి కొంటారు, అది ఒక ఆన్ లైన్ లో బిజినెస్ అంటే తను ససేమిరా నమ్మడం లేదు.
తనలా చాలా మందికి డొమైన్ (వెబ్ సైట్ పేరు )ను ఆన్లైన్ లో అంతంత పోసి కొంటారా? అనే డౌట్ మనలో చాల మందికి వచ్చింది అనుకుంట కాని కొంతమందే నన్ను అడిగారు ఎందుకంటే వాళ్ళు నన్ను తదేకంగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఫాల్లో అయినట్లేఉ అయితే మీకు ఇలాంటి డౌట్ ఎందుకు రాలేదు అసలు. వాళ్ళందరి కోసం ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఒక డొమైన్ సేల్ గురుంచి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆర్టికల్, ఫాలో అవుతారని ఇకనైనా బావిస్తున్నాను.
2012 లో ముంబై మహా నగరం లో స్టార్ట్ అయిన ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లిస్టింగ్ వెబ్ పోర్టల్ www.housing.co.in అనే మన ఇండియన్ స్టార్ట్ అప్ కంపెనీ తమ కార్యకాలాపాలను ఇండియా బయట కూడా కోన సాగించటానికి ఒక ప్లాన్ చేసింది, అంటే తమ వ్యాపారాన్ని విస్తరించటానికి www.housing.com డొమైన్ ని కొనటం జరిగింది, ముందుగ ఇండియా వైడ్ మాత్రమే చేస్తాం అని అనుకున్నారు కాని దానిని ఇప్పుడు సకోప సకలుగా విస్తరింపచేసి వరల్డ్ వైడ్ చేయాలనీ అనుకున్నారు తిరస్ చుస్తే దానిని వేరే ఒకరు కొని పెటుకుని ఉన్నారు అయితే మనకు అది కావాలంటే ఎలా ఎం చెయ్యాలి వారు ఎలా ఇస్తారు, అయితే అది ఎ వందకో, వెయ్యికో కాదు, ఏకంగా $500,000 డాలర్స్ పెట్టేసి కొన్నారు. (మన డబ్బులలో సుమారుగా 3 కోట్ల చిల్లర మాత్రమే). అయితే ఆ డొమైన్ తో పాటుగా ఒక ఫాన్సీ ఫోన్ నెంబర్ (03 333 333 333) కుడా 1మిలియన్ డాలర్స్ కి విక్రయించటం జరిగింది. అప్పుడే క్లిక్ అవుతున్న ఒక స్టార్ట్ అప్ కంపెనీ అంత అమౌంట్ పెట్టి ఒక వెబ్ సైట్ పేరు కొనటం అవసరమా అని మార్కెట్ వర్గాలు చాలానే కోడై కూసాయి కుడా అందరు ఒక్కసారిగా ఆశ్చర్య పోవడం జరిగింది అనటంలో అతిసయోక్తిగా లేదు, అయితే దాని ఫౌండర్స్ మటుకు గ్లోబల్ గా కంపెనీ మంచి పట్టు సాధించాలంటే అది తప్పనిసగా అవసరమే అని చెప్పుకురావటంతో చేసేది ఏమి లేక దానిని విక్రయించ వలసి వచ్చింది. అది మరి … ఆ వెబ్ సైట్ నేమ్ కున్న విలువ. అన్ని వెబ్ సైట్ నేమ్స్ అంత రేటుకి విక్రయిస్తార అని మనవారిలో ఇప్పుడు సందేహాలు మొదలయ్యే ఉంటాయి బాగానే కదా, కాని మనం కొంచం మన బుర్ర కు పదును పెట్టి మంచి వెబ్ సైట్ నేమ్ బుక్ చేసుకుంటే మటుకు దానికి భవిష్యత్తులో మంచి గీరాకి ఉంది తీరాల్సిందే ఇది మాత్రం కొంత మంది స్పెషల్ గానే న దృష్టికి తెచరు కూడా, వెబ్ సైట్ డొమైన్స్ అమ్మటానికి, కొనటానికి కూడా ఈ-కామర్స్ సైట్స్ లో చాలానే ఉంటాయి. మనం ఫ్లిప్ కార్ట్ లాంటి సైట్స్ లో వస్తువులు ఎలా కొంటామో , అలా మన వెబ్సైటు లను విక్రయిన్చావాచు అన్నమాట. ఆ వెబ్ సైట్స్ ఏంటి ? డొమైన్ ఎలా అమ్మాలి ? మీ డొమైన్ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు ఆన్లైన్ లో లాంటివి వీలుంటే భవిష్యత్తు లో నేను రాసే ఆర్టికల్స్ లో చూద్దాం..మిత్రులారా.
అయితే మీరు కచ్హితంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే …వెబ్ సైట్ నేమ్ బుక్ చెయ్యగానే మేము కొంటాం మాకివండి అని ఎగబడి ఏమి మీ వద్దకు రారు, మనం మంచి ఆఫర్ కోసం ఎన్ని రోజులు అయిన వెయిట్ చెయ్యాలి, ఆహ వెయిటింగ్ లో ఉండే మజానే వేరు కాని మన వారికీ వోపిక తక్కువ, మీరు ఎంచుకునే నేమ్ ఎలా ఉండాలి అంటే అసలు చూడగానే అది వాళ్ళకి ఏమైనా సరే దిని కోనేయాలి అనేలా ఉండాలి. కొన్ని సార్లు అది కొన్ని రోజులు కాదు, సంవత్సరాలు టైం కూడా పట్టొచ్చు. కొంతమంది కి వెంటనే మంచి ఆఫర్ వస్తుంది, దీనిలో కొంచం లక్కు కుడా కలిసి రావాలి .
కాని లక్ కంటే సహనం, వోపిక అవసరం …..మరి ఊరికినే రావు కదా డబ్బులు మనకి...ధన్యవాదాలు..!!!
మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!
0 comments: