శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించేందుకు వచ్చిన సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సరైనోడు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను కాసేపు లిఫ్టులో ఇరుక్కుపోయారు. సరైనోడు సినిమా ఒక రేంజ్ విజయవంతం కావడంతో శుక్రవారంనాడు సింహాచలం వచ్చిన అల్లు అర్జున్, బోయపాటి శ్రీను వీరిరువురు స్వామికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎవరు ఉహించని రీతిలో పెద్ద ఎత్తున అభిమానులు, భక్త సందోహం అల్లు అర్జున్‌ని ఒక్కసారిగా చుట్టుముట్టారు, దర్శనానంతరం ఆలయంలోంచి బయటకి వచ్చేటప్పుడు రాజగోపురం వద్ద ఉన్న లిఫ్టులో అల్లు అర్జున్, బోయపాటి పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు దానితో ఎటేల్లాలో అర్థం కాని అయోమయ స్తితిలో పడ్డారు. వారితోపాటు పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్టు అల ఆగిపోయి వారికి ముచ్చెమటలు పట్టాయి, ఆగిపోయి, తలుపులు తెరచుకోక కలకలం రేగింది. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టు తలుపులు వంచి అల్లు అర్జున్‌ని పంపించారు. లిఫ్టు మరమ్మతులకు అయ్యే ఖర్చుని తాము భరిస్తామని వారి వెంట వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సత్యనారాయణ దేవస్థానం అధికారులకు తెలియజేశారు.
మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!
No comments:
Post a Comment